లలితోపాఖ్యానం బ్రహ్మాండపురాణంలోనిది.

బ్రహ్మాండపురాణం పూర్వభాగం, మధ్యమభాగం,ఉత్తరభాగం అని మూడుభాగాలుగా విభజించబడింది. అందులో ఉత్తరభాగంలో ఐదవ అధ్యాయం ఆరంభించి, నలువదినాల్గవ అధ్యాయంవరకు (అంటే పురాణాంతం వరకు) లలితోపాఖ్యానం విస్తరించి ఉంది.ఈ బ్లాగ్‌లో నేను లలితోపాఖ్యానం ప్రథమాధ్యాయంగానే లెక్కిస్తూ వచ్చాను.కాని, మీకు అధ్యాయంతంలో మాత్రం బ్రహ్మాండపురాణం లెక్కలోనే కనిపిస్తుంది.

బ్రహ్మాండపురాణాన్ని నేను వికీసోర్స్ నుండి దేవనాగరిలిపిలో సంగ్రహించి, అక్షరముఖలో తెలుగులోకి మార్చి, మీముందుకు తెచ్చాను. కాబట్టి దీనివల్ల కలిగే గౌరవమేదైనా ఉంటే అది ఆయాకార్యకర్తలకే చెందుతుంది.వారికి నా నమస్సుమాంజలులు.

ఈ రోజు మా చెల్లెలు చి॥ల॥సౌ॥ ఉమ నాతో మాట్లాడుతూ “లలితోపాఖ్యానం ఎక్కడ దొరుకుతుంది?” అని అడిగింది. ఆమెకు దాన్ని తెలుగులో చదువుకోవడానికి అందించాలనే ఉద్దేశ్యంతో ఆరంభించాను.ఆమె చదివుకుని సంతోషపడితే చాలు. పనిలోపని ఎందరో చెల్లెళ్ళు కూడా అడిగి ఉంటారని భావించి, వారికీ ఉపయోగపడుతుందని బ్లాగ్‌లో నిక్షిప్తం చేసే రయత్నం చేస్తున్నాను.

ఇందులో టపాలన్నీ అవరోహణక్రమంలో (వెనుకనుండి ముందుకు వరుసలో)ఉంటాయి.అది బ్లాగ్ సహజలక్షణం. మీరు వరుసగా చదువుకోవాలనుకుంటే …..

https://lalithopakhyanamblog.wordpress.com/?order=asc

అనే లంకెపై నొక్కండి. మొదటినుండి చివరివరకు చదువవచ్చు.

ఈ బ్లాగ్‌లో శ్లోకాల్లో ఎక్కడైనా అక్షరదోషాలవంటివి ఉంటే, అందుకు నన్ను మన్నించండి.

Advertisements